నల్లగొండ రూరల్, జూలై 7 : నల్లగొండ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ బదిలీపై సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళుతున్న సిరిపురం వెంకటరెడ్డి సేవలు మరువలేనిది అని నల్లగొండ మండల పంచాయతీ కార్యదర్శులు అన్నారు. బదిలీపై వెళ్తున్న వెంకట్ రెడ్డికి మంగళవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడుకోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16 నెలలపాటు మండలంలో విధులు నిర్వహిస్తూ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో విశేష కృషి చేశారన్నారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్, మహమూద్, షకీల్, యశ్వంత్ సాయి, అనిల్, మధుసూదన్ రెడ్డి, ఫారుక్ , విజయ, సంధ్య, ప్రియాంక, మౌనిక, మమత, జావిద్, ఆశ, స్వరూప, అనూష కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.