MGKLI | కొల్లాపూర్ : ఎంజికేఎల్ఐతో రైతులకు సాగునీరు అందుతుందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎల్లూరు గ్రామంలోని రేగుమాన్ గడ్డ వద్ద మహాత్మాగాంధీ – కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన ఎల్లూరు పంప్ హౌస్‌లో మోటర్‌ను స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 28, 29, 30 కింద ఉన్న ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు జలాశయాలను నింపి ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా సాగునీటిని విడుదల చేయనున్నారు. పాలమూరు – రంగారెడ్డి, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాక్ట్తో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏ ప్రాజెక్టులను ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కాగితాలపై జిల్లా ఆయకట్టును 4.60 లక్షల ఎకరాలకు పెంచారన్నారు. కాలువల్లో నీటి ప్రవాహ సామర్థ్యం పెంచలేదని, మోటర్లు ఏర్పాటు చేయలేదని, 5 మోటర్లలో 2 మోటర్లు కాలిపోయినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరందస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.రాజేష్ రెడ్డి, మేఘా రెడ్డి, సీఈ విజయభాస్కర్ రెడ్డి, ఎస్ఇ సత్యనారాయణ రెడ్డి, ఈఈలు శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ ప్రభు, చంద్రవేఖర్, మరళీ, తదితరులు పాల్గొన్నారు.