WTC Final : లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా (South Africa)చరిత్ర సృష్టించే దిశగా సాగుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో 282 పరుగుల ఛేదనలో సఫారీ ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(89 నాటౌట్), కెప్టెన్ తెంబా బవుమా(51 నాటౌట్)లు అర్ధ శతకాలతో రెచ్చిపోయారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించగా.. చక్కని సమన్వయంతో ఆడుతున్న బవుమా, మర్క్రమ్.. పెద్ద షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్, డబుల్స్ తీస్తూ లక్ష్యాన్ని కరిగిస్తున్నారు.
ఇప్పటికే సెంచరీ భాగస్వామ్యంతో జట్టును గెలుపువాకిట నిలిపిందీ జోడీ. ఇంకా సఫారీల విక్టరీకి 98 రన్స్ కావాలంతే. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉండడంతో టెస్టు గదను మురిపెంగా అందుకోవాలనుకుంటోంది దక్షిణాఫ్రికా.
A phenomenal third-wicket stand between Markram and Bavuma as the Proteas tighten their grip on the #WTCFinal! 💪🔥
South Africa is cruising at 184/2 after 46 overs, just 98 runs away from the ultimate prize: the World Test Championship Mace! 🏆🏏 #WTCFinal #WozaNawe… pic.twitter.com/orkg0A0NnR
— Proteas Men (@ProteasMenCSA) June 13, 2025
ఆసీస్ నిర్దేశించిన 282 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దీటుగా ఆడుతున్నారు. 70 వద్ద రెండో వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన బవుమా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరిస్తుంటే.. క్రీజులో పాతుకుపోయిన మర్క్రమ్ జట్టును గెలిపించే దాకా విశ్రమించలేదనన్నట్టుగా ఆడుతున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 100కు పైగా భాగస్వామ్యం నమోదు చేయగా సఫారీ జట్టు విజయానికి చేరువవుతోంది. తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటున్న ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ సారథి కమిన్స్ చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రధాన బౌలర్లు విఫలం కావడంతో పార్ట్‌టైమ్ పేసర్‌గా వెబ్‌స్టర్‌ను రంగంలోకి దింపాడు ప్యాటీ. అయినా సరే వికెట్ పడితే ఒట్టు.