Woman Missing | మైలార్దేవ్పల్లి, జూన్ 13 : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వృద్ధురాలు కనిపించకుండాపోయిన ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధుబన్ కాలనీకి చెందిన చిట్టి లక్ష్మీ(75) కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. కాగా ఆమె కుమారుడు అచ్చిరెడ్డికి స్థానికంగా ఓ స్క్రాప్ షాపు ఉంది. ఈ నెల 10వ తేదీన కుమారుడు స్క్రాప్ దుకాణానికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేశారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే ఫోన్ నెంబర్ 9490617459, 8712568230, 9391279233లలో తెలియజేయాలని కోరారు.