Steve Smith : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్. ఆ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) తీవ్రంగా గాయపడ్డాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఫైనల్లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతడు.. తెంబా బవుమా (Temba Bavuma) క్యాచ్ పట్టేక్రమంలో గాయపడ్డాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో బౌన్స్ అయిన బంతిని బవుమా ఆడగా.. గాల్లోకి లేచింది. అక్కడే కాచుకొని ఉన్న స్మిత్ క్యాచ్‌ను ఒడిసిపట్టబోయాడు. కానీ, క్యాచ్ చేజారింది. బంతి వేలికి బలంగా తాకడంతో స్మిత్ నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడాడు. టీ సెషన్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన అతడు.. మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు.
ఆసీస్ వైద్య బృందం స్మిత్‌కు స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా.. కుడిచేతి చిటికెన వేలులో ఎముక స్థానభ్రంశం చెందినట్టు గుర్తించారు. దాంతో, విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించడంతో అతడు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. స్మిత్ కుడిచేతి చిటికెన వేలు ఎముక పక్కకు జరిగిందని ఓ ప్రకటనలో తెలిపింది.
Cricket Australia have confirmed Steve Smith has suffered a compound dislocation of his right little finger 🤕 pic.twitter.com/gISC1c4hwn
— ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2025
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో స్టీవ్ స్మిత్ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. రబడ ధాటికి ల్ తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ కుప్పకూలిన వేళ జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్న ఈ రన్ మెషిన్.. అర్ద శతకంతో రాణించాడు. కుర్రాడు వెబ్‌స్టర్‌తో కలిసి విలువైన చేశాడు. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 212 రన్స్‌కు ఆలౌటయ్యింది.
అనంతరం ప్యాట్ కమిన్స్(6-28) విజృంభణతో సఫారీ జట్టు 138కే కుప్పకూలింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన అతడిని ఎంగిడి ఎల్బీగా వెనక్కి పంపాడు. రబడ వికెట్ల వేట కొనసాగించగా 80లోపే ఏడు వికెట్లు కోల్పోయింది ఆసీస్. అలెక్స్ క్యారీ(43), మిచెల్ స్టార్క్(58 నాటౌట్) రాణించగా.. కమిన్స్ సేన 207 రన్స్ చేయగలిగింది.
Steve Smith injures himself while attempting a catch at slip! 😬
He walks off the field, with Sam Konstas coming in as the substitute fielder. 🇦🇺🤕#SteveSmith #AUSvSA #WTCFinal #Sportskeeda pic.twitter.com/AjAxNp1cFl
— Sportskeeda (@Sportskeeda) June 13, 2025