రెంజల్,జూన్ 13 : మండలంలోని తాఢ్ బీలోలి గ్రామ శివారు గోదావరి నది ఒడ్డున నిర్మించిన ఎత్తిపోతల పథకం స్టేజ్-1 వద్ద అమర్చిన 500 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ ఫార్మర్ ఆయిల్‌ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ మౌలానా శుక్రవారం రెంజల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
చోరీ జరిగిన ఆయిల్ విలువ సుమారు రూ.10 లక్షలు విలువ ఉంటుందని చైర్మన్ మౌలానా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. అందిన ఫిర్యాదు మేరకు రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్ చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. 2016 లో ఇదే ట్రాన్స్ట్రార్మర్ ఆయిల్ కాయిల్స్ చోరీ జరిగిన నేటి వరకు రికవరీ కాలేదని చైర్మన్ పేర్కొన్నారు.