ఖానాపూర్ : పాఠశాల బస్సులు, ఇతర వాహనాలు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని నిర్మల్ ఏఎంవీఐ మూర్తుజా అలీ ( AMVI Murtuza Ali ) అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ శివారులో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల బస్సులు సకాలంలో ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ పత్రాలను సరి చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 60 ఏళ్ల పైబడిన వారు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.