అహ్మదాబాద్: పెళ్లైన రెండు రోజులకే ఒక వ్యక్తి లండన్ బయలుదేరాడు. భర్త బర్త్ డే కోసం ఒక మహిళ లండన్ ప్రయాణమైంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వీరిద్దరూ మరణించారు. (Air India Plane crash) గుజరాత్‌లోని వడోదర జిల్లా వాడి ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల భావిక్, లండన్‌లో పని చేస్తున్నాడు. పెళ్లి కోసం రెండు వారాల కిందట భారత్ వచ్చాడు. జూన్ 10న చాలా సింపుల్‌గా కోర్టులో వివాహం చేసుకున్నాడు.
కాగా, లండన్‌లో పని చేస్తున్న అతడు వెంటనే తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందామని తన తల్లిదండ్రులకు చెప్పాడు. పెళ్లి జరిగిన రెండు రోజులకే నవ వధువు, తండ్రితో కలిసి గురువారం అహ్మదాబాద్ చేరుకున్నాడు. వారికి బై చెప్పి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన భావిక్ అది కూలిన ప్రమాదంలో మరణించాడు. దీంతో నవ వధువుతోపాటు అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
మరోవైపు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 30 ఏళ్ల హర్‌ప్రీత్ సింగ్ భర్త రాబీ సింగ్ లండన్‌లో పని చేస్తున్నాడు. జూన్ 16న అతడి పుట్టిన రోజు సెలబ్రేట్ కోసం లండన్‌కు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానంలో హర్‌ప్రీత్ సింగ్ ప్రయాణించింది. అది కూలిన ప్రమాదంలో ఆమె మరణించింది.
కాగా, భార్యాభర్తలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలం లండన్‌లో ఉన్న హర్‌ప్రీత్ సింగ్ అక్కడ జాబ్ పోవడంతో భారత్‌కు తిరిగి వచ్చిందని చెప్పారు. బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ఆమె తన భర్త బర్త్ డే సెలబ్రేషన్ కోసం లండన్ వెళ్లేందుకు బయలుదేరి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు.
Also Read:
బోయింగ్ 787 విమానాల భద్రతా తనిఖీని పెంచండి.. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశం
చెట్టు కింద ఫ్యామిలీ టీ స్టాల్ వద్ద నిద్రించిన యువకుడు.. విమాన ప్రమాదంలో మృతి
అంత్యక్రియల కోసం లండన్‌కు వెళ్తున్న ఫ్యామిలీ.. విమాన ప్రమాదంలో మృతి