న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతా తనిఖీని పెంచాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశించింది. (Air India plane crash) టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా నిర్వహించే బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లోని పలు వ్యవస్థలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలని, టేకాఫ్ నిబంధనలను సమీక్షించాలని సూచించింది. క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్, అనుబంధ వ్యవస్థల తనిఖీ, ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్ టెస్ట్, ఇంజిన్ ఇంధనంతో నడిచే యాక్చుయేటర్-ఆపరేషనల్ టెస్ట్, ఆయిల్ సిస్టమ్ తనిఖీలను చేపట్టాలని డీజీసీఏ శుక్రవారం ఆదేశించింది.
కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో అందులోని ప్రయాణికులు, సిబ్బందితో సహా 241 మంది మరణించారు. ఈ నేపథ్యంలో బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. పాత కాలం నాటి బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787 విమానాలను నిలిపివేసే విషయంలో భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించాయి. అయితే ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణ, ఆపరేటింగ్ విధానాలను కూడా లోతుగా పరిశీలించిన తర్వాతే బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు వివరించాయి.
Also Read:
అంత్యక్రియల కోసం లండన్‌కు వెళ్తున్న ఫ్యామిలీ.. విమాన ప్రమాదంలో మృతి
విమాన ప్రమాద బాధితుల కోసం.. 300 మందికిపైగా సైనికులు రక్తదానం
ఎయిర్ ఇండియా ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన 10 మందికిపైగా మృతి.. వీరిలో ఏడుగురు సిబ్బంది