Delhi Capitlas | ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. మెంటర్‌గా రాజీనామా..!
Delhi Capitlas : పంతొమ్మిదో సీజన్ ఆరంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitlas )కు ఊహించని షాక్ తగిలింది. గత సీజన్లో ఢిల్లీ మెంటర్‌గా సేవలందించిన కెవిన్ పీటర్సన్ బైబై చెప్పేశాడు.
Delhi Capitlas : పంతొమ్మిదో సీజన్ ఆరంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitlas )కు ఊహించని షాక్ తగిలింది. గత సీజన్లో ఢిల్లీ మెంటర్‌గా సేవలందించిన కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) బైబై చెప్పేశాడు. తాను ఢిల్లీ మెంటర్‌గా వైదొలుగుతున్నట్టు శనివారం వెల్లడించాడీ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్. ఫ్రాంచైజీ ఆశించినట్టుగా తాను ఈసారి పూర్తి సమయం కేటాయించకపోవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటర్సన్ వెల్లడించాడు.
ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటనతో జోరు పెంచాలనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్ కెవిన్ పీటర్సన్ సేవల్ని కోల్పోనుంది. ఈసారి పక్కా ప్లాన్‌తో కప్ కొట్టాలనుకున్న ఢిల్లీకి షాకిస్తూ అతడు బాధ్యతల నుంచి వైదొలిగాడు. అయితే.. మెంటర్‌గా ఉండడం కంటే కామెంటేటర్‌గా వ్యవహరించడమే మంచిదని భావిస్తున్నట్టు చెప్పాడీ వెటరన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడిలా.
🚨 समाचार 🚨
मैं आईपीएल के इस सीजन में दिल्ली कैपिटल्स के लिए मेंटर नहीं बन सकता।
मैं उस समय के लिए प्रतिबद्ध नहीं हो सकता, जो काम की आवश्यकता है।
सभी खिलाड़ियों को इस सीजन के लिए शुभकामनाएं! ❤️
हालांकि मैं आपको कॉम बॉक्स में वापस देखूंगा! आईपीएल दुनिया की सबसे अच्छी लीग है…
— Kevin Pietersen🦏 (@KP24) March 14, 2026
‘ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో నేను ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా కొనసాగడం లేదు. మెంటర్‌గా పూర్తి బాధ్యతగా పని చేసేందుకు అవసరమైన సమయాన్ని నేను కేటాయించలేను. కొత్త సీజన్లో ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నా. మెంటర్‌గా కొనసాగకున్నా.. నన్ను మీకు కామెంటరీ బాక్స్‌లో చూడొచ్చు. ప్రపంచంలోని టీ20 లీగ్స్‌లో ఐపీఎల్ ఉత్తమమైనది. సో.. మీ అందర్నీ త్వరలోనే చూసేందుకు నేను ఎదురుచూస్తున్నా’ అని పీటర్సన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఐపీఎల్ 18వ సీజన్ ముందు మెంటర్‌గా ఢిల్లీ కోచింగ్ యూనిట్లో చేరిన పీటర్సన్.. ఏడాది కాలానికే బాధ్యతల నుంచి వైదొలిగాడు. 19వ సీజ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

