వృద్ధురాలిపై లైంగికదాడి
ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై నివాసముంటున్న వృద్ధురాలు (60) ఆదివారం అర్థరాత్రి ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని ఓ యువకుడు ఆమెను వెంబడించాడు.
బంజారాహిల్స్, నవంబర్ 23: ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై నివాసముంటున్న వృద్ధురాలు (60) ఆదివారం అర్థరాత్రి ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని ఓ యువకుడు ఆమెను వెంబడించాడు. కొంతదూరం వెళ్లాక వృద్ధురాలిని అటకాయించిన ఆగంతకుడు ఆమెను చంపేస్తానంటూ.. బెదిరించి బలవంతంగా పక్కనున్న ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో వృద్ధురాలి వద్దనున్న ఫోన్ కిందపడిపోవడంతో పాటు ఆమె దుస్తులు చిరిగిపోయాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ 64(1),303(2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి భరత్ అనే పాతనేరస్తుడు అని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వృద్ధురాలిపై లైంగికదాడి
షూటింగ్‌కి గ్రీన్‌సిగ్నల్?
Watch: బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమె ఇంటికి నిప్పంటించిన వ్యక్తి
CM Revanth Reddy | బర్లు కాసుకునేవాళ్లు కాళేశ్వరం దగ్గర సెల్ఫీలు దిగుతున్నరు : సీఎం రేవంత్ రెడ్డి
Sheraz Mehdi | ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు థియేటర్లు దక్కడం లేదని ఆవేదన.. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసిన షెరాజ్ మెహదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

