మైనర్లు నడుపుతున్న 13 ద్విచక్ర వాహనాలు సీజ్
మైనర్లు నడుపుతున్న 13 ద్విచక్ర వాహనాలను సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
సూర్యాపేట టౌన్, మార్చి 14 : మైనర్లు నడుపుతున్న 13 ద్విచక్ర వాహనాలను సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిరంతర వాహనాల తనిఖీలు, వాహనాల జరిమానాలు, ఎన్ఫోర్స్మెంట్ నిర్వహణ అనేది ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసమేనని ఈ సందర్భంగా ఎస్ఐ సాయిరాం తెలిపారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల వారు అజాగ్రత్తగా వాహనాలు నడుపుతూ వారు ప్రమాదంలో పడడమే కాక ఎదుటివారిని కూడా ప్రమాదంలో పడేస్తారన్నారు. మైనర్ డ్రైవింగ్ అనేది చట్టరీత్యా నేరమన్నారు. పిల్లలు వాహనాలు నడుపుతూ దొరికినట్లయితే తల్లిదండ్రులపై, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ కేసుల్లో చిక్కుకునే పిల్లలకు లైసెన్సులు కూడా రావని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

