అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో (Air India Plane crash) మరణించిన వారి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. చెట్టు కింద ఉన్న ఫ్యామిలీ టీ స్టాల్ వద్ద నిద్రించిన యువకుడు ఈ దుర్ఘటనలో మరణించాడు. అతడి తల్లికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. అహ్మదాబాద్ మేఘనినగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం సమీపంలోని చెట్టు వద్ద ఒక కుటుంబం టీస్టాల్ నిర్వహిస్తున్నది. గురువారం మధ్యాహ్నం ఆ ఫ్యామిలీకి చెందిన 14 ఏళ్ల ఆకాష్ పట్ని చెట్టు కింద నిద్రించాడు. అతడి తల్లి సీతాబెన్ టీ తయారు చేస్తున్నది.
కాగా, లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం 1.39 గంటల సమయంలో ఎత్తు కోల్పోయింది. మేఘనినగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్‌పై అది కూలి పేలిపోయింది. ఆ భవనం వద్ద ఉన్న చెట్టు కింద టీ స్టాల్ వద్ద నిద్రిస్తున్న ఆకాష్ తలపై విమానానికి చెందిన పెద్ద లోహపు ముక్క పడింది. ఆ తర్వాత మంటల్లో కాలి ఆ బాలుడు సజీవ దహనమయ్యాడు.
మరోవైపు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఆకాష్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షల కోసం అతడి తండ్రి నమూనాలు ఇచ్చాడు. కుమారుడు ఆకాష్‌ను కాపాడటానికి ప్రయత్నించిన తల్లి సీతాబెన్కు తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
Also Read:
బోయింగ్ 787 విమానాల భద్రతా తనిఖీని పెంచండి.. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశం
అంత్యక్రియల కోసం లండన్‌కు వెళ్తున్న ఫ్యామిలీ.. విమాన ప్రమాదంలో మృతి
విమాన ప్రమాద బాధితుల కోసం.. 300 మందికిపైగా సైనికులు రక్తదానం