Hyderabad | బండ్లగూడ, జూన్ 18 : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నీటి దందా వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఏకంగా నివాసాల మధ్యలోనే అక్రమ నీటి వ్యాపార దుకాణాలను తెరిచారు. హిమాయత్ సాగర్, కిస్మత్పూర్, బండ్లగూడ తదితర ప్రాంతాలలో మూసీ పరివాహక ప్రాంతాల నుంచి నీటి వ్యాపారాలు కొనసాగుతున్నాయి. వేల లీటర్ల ట్యాంకులలో నీటిని నింపి లారీల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలలో నివాసాలలో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న బస్తీలలో చిన్న చిన్న ట్యాంకర్ల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు.
కార్పొరేషన్ పరిధిలోని హిమగిరి నగర్ కాలనీలో ఓ ఇంట్లో వాటర్ ప్లాంట్ను చేసి అక్రమ నీటి వ్యాపారం ఇలాంటివి కార్పొరేషన్ పరిధిలో అనేకం ఉన్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానికంగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో స్థానికులు వీరు నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోనీ ఇలాంటి అక్రమ నీటి వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.