Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలతో షూటర్ మను భాకర్ (Manu Bhaker) కెరీర్ మలుపు తిరిగింది. బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె వాల్యూ కోట్లకు పడగలెత్తింది. అంతేకాదు విశ్వ క్రీడల్లో గురితప్పకుండా దేశాన్ని గర్వపడేలా చేసిన మను ఎందరికో స్ఫూర్తిగా మారింది. తానొక షూటర్ మాత్రమే కాదని.. ఈతరం అమ్మాయిని కూడా అని చాటుతూ మను ఈమధ్యే లాక్మే ఫ్యాషన్ వీక్ (Lakme Fashion Week)లో తళుక్కున మెరిసింది. అయితే.. ఆమె అలా ర్యాంప్‌పై వయ్యారంగా నడవడం నచ్చని కొందరు పనిగట్టుకొని మరీ విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక మౌనంగా ఉంటే వాళ్లు మరింత రెచ్చిపోతారని భావించిన ఒలింపిక్ విజేత తన స్టయిల్లో జవాబిచ్చింది. తనపై ఊరికే చెత్త రాతలు రాస్తున్న వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇంతకూ మను తన పోస్ట్‌లో ఏం రాసిందంటే.. ఏ విషయంలోనైనా సరే మీకు మీరే హద్దులు గీసుకోకండి. మీ జీవితాన్ని గొప్పగా మార్చుకోండి. మీ కెరీర్‌ను ప్రకాశవంతంగా చేసుకొని.. మీ కన్నవాళ్లు గర్వపడేలా చేయండి. ఏ పని చేసినా నచ్చనివాళ్లు అసహ్యించుకునే వాళ్లు ఎప్పుడూ అసహ్యించుకుంటునే ఉంటారు.
From the shooting lanes to fashion ramp walk, its just a break for me. I loved it. Normal is boring.#shooting #fashion #rampwalk pic.twitter.com/xiKBtRmcKN
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) October 15, 2024
ఎందుకంటే.. ఏ పనిలోనైనా విజయం సాధించేందుకు షార్ట్ కట్స్ ఉండవు. పైగా దేవుడు ఎంతో శక్తిని, బలాన్ని ఇచ్చినప్పుడు చిన్న చిన్న పనులు చేయడం దేనికి. కష్టమైన పనులు చేసి మురిసిపోండి అంటూ మను విమర్శకులకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. గన్ పేల్చడమే కాదు మాటల తూటాలు పేల్చడంలోనూ తాను దిట్టనే అని చాటిన మను భాకర్‌ను అందరూ అభినందిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ పతక బోణీతో దేశాన్ని సంబురాల్లో ముంచెత్తింది. టోక్యోలో పతకం చేజార్చుకున్న ఆమె.. కోచ్ జస్పాల్ రాణా(Jaspal Rana) శిక్షణలో అదరగొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో సత్తా చాటిన ఆమె కంచు మోత మోగించింది. మొదట వ్యక్తిగత విభాగంలో అదిరే గురితో కాంస్యం గెలిచిన మను.. అనంతరం సరబ్జోత్ సింగ్ (Sarabhjot Singh)తో కలిసి దేశానికి రెండో పతకం అందించింది. తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత షూటర్‌గా మను చరిత్ర సృష్టించింది.