WIW vs ENGW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్. గ్రూప్ ‘బీ’ నుంచి సెమీస్ బెర్తులు ఎవరివో ఈరోజుతో తేలిపోనుంది. ఇప్పటికే గ్రూప్ ‘ఏ’ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఇప్పుడు మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, వెస్టిండీస్ మ్యాచ్‌తో గ్రూప్ ఏ నుంచి టాప్ -2 గా నిలిచి ముందడుగు వేసేది ఎవరో ఖరారవుతుంది. ఇరుజట్లకు కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్‌లో తడబడుతున్న ఇంగ్లీష్ జట్టును తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడమే తమ లక్ష్యమని హేలీ చెప్పింది.
చావోరేవో పోరులో విండీస్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆరంభ ఎడిషన్‌లో చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్.. రెండో టైటిల్ వేటలో ముందుడుగు వేయాలనే పట్టుదలతో ఉంది. ఇరుజట్లలోనూ విధ్వంసక బ్యాటర్లు, నాణ్యమైన స్పిన్నర్లు ఉండడంతో.. ‘నువ్వా నేనా’ అన్నట్టు మ్యాచ్ సాగనుంది.
West Indies, who need a big win to have a shot at qualifying, will chase today in Dubai!
Follow ball-by-ball 👉 https://t.co/ENqk7q6eAK #T20WorldCup #ENGvWI pic.twitter.com/cTPqeuIyRf
— ESPNcricinfo (@ESPNcricinfo) October 15, 2024
ఇంగ్లండ్ జట్టు : మైయ బౌచియర్, డానియల్ వ్యాట్, అలిసే క్యాప్సే, నాట్ సీవర్ బ్రంట్, హీథర్ నైట్(కెప్టెన్), అమీ జోన్స్(వికెట్ కీపర్), డానియెల్లె గిబ్సన్, చార్లొల్టే డీన్, సోఫీ ఎకిల్‌స్టోన్, సరాహ్ గ్లెన్, లారెన్ బెల్.
వెస్టిండీస్ జట్టు : హేలీ మాథ్యూస్(కెప్టెన్), క్వియానా జోసెఫ్, షెమైనే క్యాంప్‌బెల్ (వికెట్ కీపర్), డియాండ్ర డాటిన్, చినెల్లె హెన్రీ, చెడియన్ నేషన్, జైదా జేమ్స్, అశ్మిని మునీసర్, అలియాహ్ అల్లెయ్నె, అఫి ఫ్లెచర్, కరిష్మా రామ్హరాక్.
ఇక గ్రూప్ బీ నుంచి సెమీస్ అవకాశాలు మూడు జట్లుకు ఉన్నాయి. ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఎవరు సెమీస్ వెళ్తారు? అనే దానిపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. అప్పుడు వెస్టిండీస్ ఇంటిదారి పట్టడం ఖాయం. గ్రూప్‌లో 6 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికాకు సెమీస్ చాన్స్ ఉంటుంది.