BCB : ఆసియాలో మెరుగైన రికార్డు.. పాకిస్థాన్ గడ్డపై చిరస్మరణీయ విజయం.. ఇంకేముంది రెట్టించిన ఉత్సాహంతో భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ (Bangladesh)కు గట్టి ఎదురుదెబ్బ. వరల్డ్ క్లాస్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కలిగిన టీమిండియా చేతిలో బంగ్లాకు ఘోర పరాభవం తప్పలేదు. రెండు టెస్టుల సిరీస్‌లో 2-0తో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ పొట్టి సిరీస్‌లోనూ తోకముడిచింది. రెండు సిరీస్‌లు పోగొట్టుకున్న ఆ జట్టుకు మరో షాకింగ్ న్యూస్. సొంతగడ్డపై త్వరలోనే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఉందనగా ప్రధాన కోచ్ చందికా హథురుసింఘే (Chandika Hathurusinghe)పై వేటు పడింది. అతడిని సస్పెండ్ చేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగిందంటే..?
భారత పర్యటనలో టెస్టు, టీ20 సిరీస్‌లలో వైట్ వాష్ కారణంగానే బంగ్లాదేశ్ బోర్డు హెడ్‌కోచ్ చందికా హథురుసింఘేపై వేటు వేయలేదు. గత కొంత కాలంగా బంగ్లాదేశ్ సంచలన విజయాలకు కారణమై అతడిపై సస్పెన్షన్‌కు ఇంకో కారణం ఉంది. నిరుడు భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్ సమయంలో చందికా హద్దు మీరాడు. ఆవేశంతో ఓ బంగ్లా క్రికెటర్‌ను కొట్టాడు. ఆ తర్వాత అతడు చెప్పాపెట్టకుండా సెలవులు తీసుకున్నాడు.
JUST IN: Bangladesh head coach Chandika Hathurusinghe has been suspended following allegations he slapped a player at last year’s ODI World Cup.
His contract will be terminated after 48 hours of suspension, with Phil Simmons to take over until next year’s Champions Trophy pic.twitter.com/7Jq7uXuDW4
— ESPNcricinfo (@ESPNcricinfo) October 15, 2024
కాంట్రాక్ట్ సమయంలో నిర్ణయించిన వాటికంటే ఎక్కువగా చందికా లీవ్స్ పెట్టాడు. దాంతో, ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చందికాపై 48 గంటలు.. అంటే రెండు రోజులు నిషేధం విధించారు. అయితే.. ఏమైందో తెలియదు వెంటనే అతడిపై సస్పెన్షన్‌ను ఎత్తేశారు. అయితే.. బంగ్లా ఆటగాడిని కొట్టడానికి, పరిమితికి మించి సెలవులు పెట్టడానికి కారణం చెప్పాలని చందికను బీసీబీ ఆదేశించింది.
Bangladesh lost another test series due to the failure of the batsmen. Lost to India by 7 wickets in the second Test. When will the senior players Mushi, Mominul Litton take charge. #indvsbangladesh #INDvsBANTEST #INDvBAN pic.twitter.com/ZOdQVC2Xwf
— Md Ifran Ali Bijoy 🇧🇩 (@IfranAliBijoy20) October 1, 2024
ఇక.. రెండు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా (South Africa) జట్టు బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య అక్టోబర్ 21న ఢాకాలో తొలి టెస్టు, అక్టోబర్ 29న ఛత్రోగ్రామ్లో రెండో టెస్టు జరుగనున్నాయి. టీమిండియా జోరు ముందు నిలవలేక సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్ స్వదేశంలో విజయంతో ఊరట చెందాలని భావిస్తోంది.