Hyderabad | హైదరాబాద్ : మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఏడేండ్ల బాలిక.. శవమై కనిపించింది. బిడ్డ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ విషాద ఘటన సూరారంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌కు చెందిన భార్యాభర్తలిద్దరూ బతుకుదెరువు కోసం తన బిడ్డ(7)తో కలిసి హైదరాబాద్‌లోని సూరారం వచ్చారు. గత ఏడు నెలల నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే శనివారం(అక్టోబర్ 12) నాడు ఏడేండ్ల బిడ్డ అదృశ్యమైంది. దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లిదండ్రులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే ఇవాళ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి పరిధిలోని బాసరగడి వద్ద బ్యాగులో మృతదేహాం ఉన్న విషయాన్ని స్థానికులు గమనించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన సూరారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సూరారం నుంచి గుండ్లపోచంపల్లి దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
IAS Officers | ఐఏఎస్‌లకు చుక్కెదురు.. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులకు క్యాట్ నో..!
Gachibowli | గచ్చిబౌలిలో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడి
Devara Movie | శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.. ‘దేవర’ సక్సెస్‌పై ‘ఎన్టీఆర్’ ఎమోషన్