హైదరాబాద్: పదేండ్ల పాటు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యం నేరాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల నిఘా వైఫల్యంతో దొంగతనాలు, హత్యలు, లైంగికదాడులు, మహిళలపై వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ మోండామార్కెట్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటన మరువకముందే.. గచ్చిబౌలిలో (Gachibowli) దారుణం చోటుచేసుకున్నది. ఓ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు.
మంగళవారం తెల్లవారుజామున 2.30గంటలకు ఆర్సీ పురం వద్ద బాధిత యువతి ఓ ఆటోలో ఎక్కింది. అయితే మసీద్‌బండ ప్రాంతంలో ఆటో డ్రైవర్ ఆమెను అత్కాచారం చేశాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు.