Devara Movie | తన కొత్త సినిమా ‘దేవర’ పార్ట్-1కు దక్కిన ఆదరణపై జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర బృందం, ప్రేక్షకులు, అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సందేశం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్.
దేవర్ పార్ట్-1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పిటకీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నా సహ నటులైనా సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్.. వారి పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారని జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫి, సాబు ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కొసరాజుకు ధన్యవాదాలు. ప్రపంచం నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులైన నా అభిమానులకు, గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చూపించే ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎల్లప్పుడూ గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. దేవర్ పార్ట్ 1 చిత్రాన్ని మీ భుజాలపై మోసి, ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
Grateful. pic.twitter.com/YDfLplET7S
— Jr NTR (@tarak9999) October 15, 2024
ఇవి కూడా చదవండి..
Kanguva | సూర్య కంగువ టార్గెట్ రూ.2 వేల కోట్లు.. మరి దర్శకనిర్మాతల అంచనాలు అందుకుంటుందా..?
Diwali Movies | దీపావళి ధమాకా.. ఏకంగా ఆరు సినిమాల సందడి
Ram Gopal Varma | ఆర్జీవీ డెన్లో ఓ యానిమల్తో మరో యానిమల్.. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటో..?