Diwali Movies | ప్రతీ యేటా పండుగల సీజన్లో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయని తెలిసిందే. ఇప్పటికే దసరా సందర్భంగా రిలీజైన సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక రాబోయే సీజన్ దీపావళి (Diwali Movies). ఈ సీజన్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ సారి ఏకంగా ఆరు సినిమాలు దీపావళి బరిలో నిలుస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేస్తే..
క :
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం క (KA). 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా కథాంశంతో వస్తోంది. సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
లక్కీ భాస్కర్ :
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్ట మేకర్స్ ప్రకటించారని తెలిసిందే.
నిఖిల్ సిద్దార్థ హీరోగా నటిస్తోన్న అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతోపాటు సత్యదేవ్ నటిస్తోన్న జీబ్రా కూడా దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. మరి ఈ దీపావళి విన్నర్‌గా నిలిచే యాక్టర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. వీటితోపాటు డబ్బింగ్ సినిమాలు శివకార్తికేయన్ నటిస్తున్న అమరన్, జయం రవి నటిస్తోన్న బ్రదర్ కూడా ఈ రేసులో ఉన్నాయి.
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్
They Call Him OG | అందమైన లొకేషన్లో ఓజీ షూటింగ్.. ఇంతకీ పవన్ కల్యాణ్ టీం ఎక్కడుందో..?
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే