Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీకి శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. కంగువ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడులవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.
ప్రమోషన్స్‌లో డైరెక్టర్ శివ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. కంగువ రన్‌టైం 2 గంటల 26 నిమిషాలు. చారిత్రక నేపథ్యం ఉన్న పోర్షన్లలో కంగువగా కనిపిస్తాడు సూర్య. సుమారు 2 గంటలపాటు కంగువ మేనియా ఉంటుంది. ప్రస్తుత కథ కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పాడు. సూర్య కంగువగా ఇదివరకెన్నడూ కనిపించని నయా అవతార్‌లో కనిపిస్తాడు. హిస్టారికల్ పోర్షన్లలో సూర్య రౌద్రరూపంలో కనిపించనుండగా.. వర్తమానానికి సంబంధించిన సన్నివేశాలు ఫన్‌గా సాగుతాయని కూడా చెప్పాడు.
మరోవైపు సినిమా అవుట్ పుట్ పట్ల చాలా నమ్మకంతో ఉన్నామని.. కంగువ రూ.2000 కోట్లు వసూళ్లు చేయడం పక్కా అని ధీమా వ్యక్తం చేశాడు నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా. కంగువ వసూళ్ల విషయంలో జ్ఞానవేళ్ రాజా కాన్ఫిడెన్స్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు సినీ జనాలు. ఈ మూవీని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
#KANGUVA All Interviews Done✨
WHOLESOME & FULL POSITIVITY❤️ pic.twitter.com/SAXIoXsu5N
— Saloon Kada Shanmugam (@saloon_kada) October 15, 2024
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్
They Call Him OG | అందమైన లొకేషన్లో ఓజీ షూటింగ్.. ఇంతకీ పవన్ కల్యాణ్ టీం ఎక్కడుందో..?
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే