Metro train | మెట్రో ట్రెయిన్లో ప్రయాణించిన మహిళ సొత్తు మాయం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Metro train | మెట్రోరైల్లో(Metro train) ఎక్కిన మహిళ(Woman )బ్యాగులోంచి నగదుతో పాటు బంగారం(Gold) మాయమయిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బంజారాహిల్స్,అక్టోబర్ 15 : మెట్రోరైల్లో(Metro train) ఎక్కిన మహిళ(Woman )బ్యాగులోంచి నగదుతో పాటు బంగారం(Gold) మాయమయిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండలోని నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన శోభలత అనే వృద్ధురాలు ఈనెల 10న కంటి పరీక్షల కోసం బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు తన సోదరితో కలిసి వచ్చింది. చికిత్స పూర్తయిత తర్వాత సొంతూరుకు వెళ్లే క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం 5లోని మెట్రోస్టేషన్ వద్దకు వచ్చి ట్రైన్ ఎక్కింది. ఉప్పల్ సమీపంలోని ఎన్జీఆర్ఐ స్టేషన్లో మెట్రో దిగి అక్కడినుంచి బస్సులో హన్మకొండకు వెళ్లిపోయింది.
ఇంటికి వెళ్లిన తర్వాత తన బ్యాగు చూసుకోగా రూ.12వేల నగదుతో పాటు 5గ్రాముల చెవికమ్మలు కనిపించలేదు. తాను జూబ్లీహిల్స్ రోడ్ నెం 5 మెట్రోస్టేషన్లో ప్రవేశించినప్పుడు బ్యాగును స్కాన్ చేశారని, దానిలో నగదు ఉన్న విషయాన్ని గుర్తించిన సెక్యురిటీ సిబ్బంది ఈ విషయాన్ని దొంగలకు చెప్పి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ బాధితురాలు హన్మకొండ నుంచి వచ్చి సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

