Hyderabad | బంజారాహిల్స్,అక్టోబర్ 15: మహిళ ఇంటికి వచ్చి కత్తితో(Knife) బెదిరిస్తున్న(Threatened the woman) యువకుడిపై జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత(36) తన ఇంటికి సమీపంలోని టైలర్ షాపులో చాలా ఏళ్లుగా బట్టలు కుట్టిస్తూ ఉండేది. కాగా, టైలర్ కొడుకు రిషి (21) గత కొంతకాలంగా షాపుకు వచ్చే వివాహితను అక్కా అని పిలుస్తూ అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు. అయితే కొన్ని రోజులనుంచి రిషి ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం, రాత్రిపూట కాల్స్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నాడు.
దీంతో సదరు మహిళ నాలుగురోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పెటీ కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. తమ కొడుకు మానసిక స్థితి సరిగాలేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రిషి కుటుంబసభ్యులు సర్దిచెప్పారు. కాగా, మంగళవారం తెల్లవారుజామున వివాహిత ఇంటి వద్దకు కత్తితో వచ్చిన రిషి న్యూసెన్స్ చేయడంతో పాటు చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వగా అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.