INDW vs ENGW : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో భారత అమ్మాయిలు చెలరేగి ఆడున్నారు. రివర్సైడ్ గ్రౌండ్లో ఓపెనర్ స్మృతి మంధాన(45) తనదైన స్టయిల్లో ఇంగ్లండ్ బౌలర్లకు దడ పుట్టిస్తూ బౌండరీలతో విరుచుకుపడింది. ప్రతీకా రావల్(26)తో కలిసి శుభారంభమిచ్చిన మంధాన అర్ధ శతకానికి ముందు పెద్ద షాట్ ఆడి డంక్లే చేతికి చిక్కింది. దాంతో, 81వద్ద రెండో వికెట్ పడింది. ప్రస్తుతం హర్లీన్ డియోల్(30 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(16 నాటౌట్)లు ధనాధన్ ఆడుతూ స్కోర్ బోర్డును ఉరికిస్తున్నారు.
టాస్ గెలిచిన భారత జట్టకు ఓపెనర్లు స్మృతి మంధాన(45), ప్రతికా రావల్(26)లు అదిరే ఆరంభమిచ్చారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలతో ఇంగ్లండ్ బౌలర్లను ఒత్తిడిలో పడేశారు. ఈ జోడీ అర్ధ శతక భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు బాటలు వేసింది. తొలి వికెట్‌కు 64 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని చార్లీ డీన్ విడదీసింది.
Mandhana falls for a 54-ball 45 🏏#ENGvIND LIVE 👉 https://t.co/O84VWYFNXm pic.twitter.com/k4ZqDVD7Nv
— ESPNcricinfo (@ESPNcricinfo) July 22, 2025
ప్రతీక ఔటయ్యాక హర్లీన్ డియోల్ అండగా మంధాన కీలక భాగస్వామ్యం నెలకొల్పాలనుకుంది. కానీ, ఎకిల్‌స్టోన్ ఓవర్లో డంక్లేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(16), డియోల్ మరో వికెట్ పడకుండా ఫిఫ్టీ రన్స్ పిండుకున్నారు. వీరిద్దరి తర్వాత జెమీమా, రీచా, రాధికా.. ఉండడంతో భారత జట్టు ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంపై దృష్టి పెట్టింది. 26 ఓవర్లకు స్కోర్.. 123/2.