రామగిరి, జూలై 22 : తెలంగాణ సాహిత్యంలో ప్రముఖ వ్యక్తి దాశరథి కృష్ణామాచార్య. ఆయన రచనలు తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని, భక్తితో పాటు సామాజిక చైతన్యాన్ని ప్రతిబింభిస్తాయని డీవీఎం విద్యా సంస్థల కరస్పాండెంట్ దొడ్డా శాంతికుమార్ అన్నారు. దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకుని నల్లగొండలోని డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్లో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు.
విద్యార్థులు సాహిత్య అంశాలపై పట్టు సాధించాలని, స్వీయ రచనతో ఎంతో గుర్తింపు వస్తుందన్నారు. దాశరథి కీర్తిని నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవీఎం ఎంఈడీ, బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్ డా. పి.గాంగధర్రావు, బి.నారాయణరెడ్డి, బొడ్డుపల్లి రామకృష్ణ, ఎంఈడీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్స్ బి.కన్నయ్య, డా.పి.హరి, డాక్టర్ కె. తిరుపతి, డాక్టర్ అశ్వథారెడ్డి, బి. విజయ్, ఎంఈడీ, బీఈడీ ఉపాధ్యాయులు బూర్గు గోపికృష్ణ, కవ్య, బి.జ్యోతి, మాదవి పాల్గొన్నారు.