T20 Century : ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెటర్లు సరికొత్త రికార్డులు లిఖిస్తున్నారు. తొలి టెస్టులో రిషభ్ పంత్ (Rishabh Pant) రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో రెండో వికెట్‌కీపర్‌గా అవతరించాడు. శుభ్‌మన్ గిల్ సారథిగా తొలి మ్యాచ్‌లోనే వంద కొట్టేసి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఇప్పుడు తమ వంతు అన్నట్టు మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మెరుపు సెంచరీతో చెలరేగింది.
ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించిన ఆమె బౌండరీలతో విరుచుకుపడింది. 51 బంతుల్లోనే మూడంకెల స్కోర్‌కు చేరుకొని పలు రికార్డులు నెలకొల్పింది. ఇదే మైదానంలో మూడేళ్ల క్రితం సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టీ20 శతకం బాదాడు. ఆతిథ్య జట్టు బౌలింగ్ దళంపై సునామీలా చెలరేగిన మిస్టర్ 360 కేవలం 55 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు.
Only two Indians have a T20I hundred at Trent Bridge 💯 🇮🇳 pic.twitter.com/4WCapxkcmg
— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2025
అచ్చం అతడి తరహాలోనే వీరవిహారం చేసిన మంధాన 62 బంతుల్లో 112 రన్స్‌తో టీమిండియా భారీ స్కోర్‌లో భాగమైంది. మొత్తంగా.. ట్రెంట్‌బ్రిడ్జి వేదికగా జరిగిన పొట్టి పార్మాట్ గేమ్‌లో వంద కొట్టిన భారత క్రికెటర్లుగా సూర్య, మంధాన గుర్తింపు సాధించారిద్దరు.
ఐదు టీ20ల సిరీస్ తొలిమ్యాచ్‌లోనే భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. నాటింగ్హమ్లోని ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(112) అకాశమే హద్దుగా చెలరేగింది. ఈ ఫార్మాట్లో తొలి శతకంతో ఆమె గర్జించగా.. హర్లీన్ డియోల్(43) మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ ఇద్దరి విధ్వసంతో టీమిండియా పొట్టి క్రికెట్లో టీమిండియా రెండో అత్యధిక స్కోర్ కొట్టింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసిన మంధాన బృందం ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది.