అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India plane crash) మరణించిన చివరి మృతుడ్ని కూడా డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించారు. మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించారు. దీంతో ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 260గా అధికారికంగా లెక్కతేల్చారు. 181 మంది ప్రయాణికులు, నేలపై మరణించిన 19 మందితో కలిపి 200 మంది మృతులు భారతీయులు. 52 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ ఈ ప్రమాదంలో చనిపోయినట్లు ప్రభుత్వం శనివారం పేర్కొంది.
కాగా, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 270 మంది మరణించినట్లు తొలుత అధికారులు పేర్కొన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 40 ఏళ్ల బ్రిటీష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా విమానంలోని 241 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించారు.
మరోవైపు జూన్ 12న లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని క్షణాల్లోనే ఎత్తు కోల్పోయింది. ఎయిర్పోర్ట్ సమీపంలోని హాస్పిటల్ హాస్టల్‌పై కూలి పేలిపోయింది. ఆ సమయంలో హాస్టల్ మెస్‌లో ఉన్న వైద్య విద్యార్థులతో సహా ఆ ప్రాంతంలో ఉన్న 19 మంది మరణించగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంత మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
Also Read:
PM Speaks To Shubhanshu Shukla | ఐఎస్ఎస్లో ఉన్న శుభాన్షు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ
ISIS India Head Dies In Hospital | ఐఎస్ఐఎస్ ఇండియా హెడ్ సాక్విబ్ నాచన్.. మెదడులో రక్తస్రావంతో మృతి
Woman Kills Pet Dog In ‘Tantric’ Ritual | క్షుద్ర పూజల కోసం.. పెంపుడు కుక్కను బలి ఇచ్చిన మహిళ