న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకున్న తొలి భారతీయుడు శుభాన్షు శుక్లాతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మాట్లాడారు. (PM Speaks To Shubhanshu Shukla) మాతృభూమికి ఆయన దూరంగా ఉన్నప్పటికీ భారతీయుల హృదయాలకు అత్యంత దగ్గరగా ఉన్నారని కొనియాడారు. ‘మీ పేరులోనే శుభం ఉంది. కొత్త యుగానికి మీ యాత్ర శుభారంభంగా నిలుస్తుంది’ అని అన్నారు.
కాగా, భారత వ్యోమగామి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా కూడా ప్రధాని మోదీతో మాట్లాడారు. ‘ఇది నా ఒక్కడి ప్రయాణం కాదు, మన దేశానిది కూడా’ అని అన్నారు. భారతదేశం చాలా అద్భుతంగా ఉన్నదని, మ్యాప్‌లో కంటే పెద్దగా కనిపిస్తున్నది తెలిపారు. అలాగే ఐఎస్ఎస్లో తన జీవితం ఎలా ఉన్నది, తన కార్యకలాపాల గురించి ఆయన వివరించారు.
మరోవైపు 1984లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా రాకేష్ శర్మ ఖ్యాతి పొందారు. అయితే 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోకి చేరుకున్న తొలి భారతీయుడిగా 39 ఏళ్ల శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు.
#WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.
PM Modi says “Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians…Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3
— ANI (@ANI) June 28, 2025
#WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.
Group Captain Shubhanshu Shukla says, “Thank you, PM Modi, for your wishes and the wishes of 140 crore Indians. I am fine and safe here. I am… pic.twitter.com/C67rEwz7mY
— ANI (@ANI) June 28, 2025
#WATCH | Group Captain Shubhanshu Shukla says “…When we saw India for the first time, we saw that India looks very grand, very big, much bigger than what we see on the map… When we see the Earth from outside, it seems that no border exists, no state exists, and no countries… pic.twitter.com/iVOBPmkHIP
— ANI (@ANI) June 28, 2025
Also Read:
Woman Kills Pet Dog In ‘Tantric’ Ritual | క్షుద్ర పూజల కోసం.. పెంపుడు కుక్కను బలి ఇచ్చిన మహిళ
Cop Caught With Rs 9 Lakh Bribe | కారులో రూ.9 లక్షలకుపైగా డబ్బుతో పోలీస్ అధికారి.. పట్టుకున్న ఏసీబీ
Man Kills Father Over Front Seat | ముందు సీటులో కూర్చోవడంపై వివాదం.. తండ్రిని కాల్చి చంపిన కొడుకు