జైపూర్: ఒక పోలీస్ అధికారి లంచంగా తీసుకున్న రూ.9 లక్షలకుపైగా డబ్బుతో కారులో వెళ్తున్నాడు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ఈ సమాచారం తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు మార్గమధ్యలో ఆ పోలీస్ అధికారి కారు ఆపి తనిఖీ చేశారు. (Cop Caught With Rs 9 Lakh Bribe) అందులో ఉన్న రూ.9.35 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఆ పోలీస్ అధికారి ఇంట్లో సోదాలు చేయగా రూ.30 లక్షల నగదు లభించింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (ఏఎస్పీ) జగారామ్ మీనా శుక్రవారం సాయంత్రం ఝలావర్ నుంచి జైపూర్‌కు కారులో వస్తున్నారు.
కాగా, పోలీస్ అధికారి మీనా కారులో భారీగా డబ్బు ఉన్నట్లు ఏసీబీ ఇంటెలిజెన్స్ వింగ్‌కు సమాచారం అందింది. దీంతో శివదాస్‌పురా టోల్ పోస్ట్ వద్ద ఆయన కారును ఏసీబీ అధికారులు ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న రూ.9.35 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఏఎస్పీ మీనా ఆ డబ్బు గురించి సరైన సమాధానం చెప్పలేదు. ఈ నేపథ్యంలో జగత్‌పురాలోని కేసర్ నగర్లో ఉన్న మీనా ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆ ఇంట్లో రూ.30 లక్షల నగదుతో పాటు, బంగారం, ఆస్తుల పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ పోలీస్ అధికారి అక్రమ సంపాదనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ (డీజీ) డాక్టర్ రవి ప్రకాష్ మెహర్దా తెలిపారు.
Also Read:
Man Kills Father Over Front Seat | ముందు సీటులో కూర్చోవడంపై వివాదం.. తండ్రిని కాల్చి చంపిన కొడుకు
Acid On Pregnant Woman’s Abdomen | కాన్పు సమయంలో.. గర్భిణీ కడుపుపై యాసిడ్ రాసిన నర్సు