ముంబై: ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కాన్సు సమయంలో గర్భిణీ కడుపుపై మెడికల్ జెల్‌కు బదులు యాసిడ్‌ను నర్సు రాసింది. (Acid On Pregnant Woman’s Abdomen) దీంతో ఆ మహిళ కడుపుపై యాసిడ్ వల్ల కాలిన గాయాలయ్యాయి. ఈ బాధతోనే పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖపర్ఖేడా గ్రామానికి చెందిన షీలా భలేరావు నిండు గర్భిణి. కాన్పు కోసం భోకర్దాన్లోని ప్రభుత్వ గ్రామీణ ఆసుపత్రిలో ఆమె చేరింది.
కాగా, శుక్రవారం ఆ మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. అయితే డెలివరీ ప్రక్రియలో ఉపయోగించే మెడికల్ జెల్లీగా భావించిన నర్సు ఆ బాటిల్లో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను గర్భిణి కడుపుపై రాసింది. దీంతో ఆ మహిళ కడుపుపై యాసిడ్ వల్ల కాలిన గాయాలయ్యాయి. ఆ బాధతోనే ఆరోగ్యకరమైన బిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
మరోవైపు టాయిలెట్ క్లీనింగ్ కోసం వినియోగించే యాసిడ్‌ను పారిశుద్ధ్య సిబ్బంది పొరపాటున మెడికల్ ట్రేలో ఉంచినట్లు ఆసుపత్రి అధికారి తెలిపారు. ఈ నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read:
Watch: హైకోర్టు లైవ్ స్ట్రీమ్ విచారణకు టాయిలెట్ నుంచి హాజరైన వ్యక్తి.. వీడియో వైరల్
Watch: ఇండిగో విమానంలో లైఫ్ జాకెట్ దొంగిలించిన ప్రయాణికుడు.. తర్వాత ఏం జరిగిందంటే?