న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఎస్) ఇండియా కార్యకలాపాల అధిపతి, నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) మాజీ ఆఫీస్ బేరర్ సాక్విబ్ నాచన్ (ISIS India Head Dies In Hospital) శనివారం మరణించాడు. మెదడులో రక్తస్రావంతో ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చనిపోయాడు. 57 ఏళ్ల నాచన్ ఢిల్లీ, మహారాష్ట్రలోని పద్ఘా ప్రాంతంలో విస్తరించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. 2023లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అతడ్ని అరెస్టు చేసింది. నాటి నుంచి జ్యుడీషియల్ కస్టడీ కింద ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. జైలులో నాచన్ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అతడి మెదడులో రక్తస్రావం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం మధ్యాహ్నం నాచన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో మరణించాడు.
కాగా, సాక్విబ్ అబ్దుల్ హమీద్ నాచన్ మహారాష్ట్రలోని థానే జిల్లాలోని పద్ఘా పట్టణానికి చెందిన వ్యక్తి. 1990 చివర, 2000 ప్రారంభంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి 2001లో నిషేధించిన సిమీలో కీలక వ్యక్తిగా ఎదిగాడు. 2002, 2003లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల దర్యాప్తులో నాచన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు అతడికి పదేళ్లు జైలు శిక్ష విధించింది.
మరోవైపు జైలులో నాచన్ మంచి ప్రవర్తనకుగాను ఐదు నెలలకుపైగా ఉపశమనంతో 2017లో విడుదలయ్యాడు. అయితే ఐఎస్ఎస్ ఉగ్రవాదులు, మద్దతుదారులపై కఠిన చర్యల్లో భాగంగా 2023లో నాచన్ను మళ్లీ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఢిల్లీ- పద్ఘా ఐఎస్ఐఎస్ టెర్రర్ మాడ్యూల్ కేసులో ప్రధాన నిందితుడిగా అతడ్ని గుర్తించింది.
Also Read:
Woman Kills Pet Dog In ‘Tantric’ Ritual | క్షుద్ర పూజల కోసం.. పెంపుడు కుక్కను బలి ఇచ్చిన మహిళ
PM Speaks To Shubhanshu Shukla | ఐఎస్ఎస్లో ఉన్న శుభాన్షు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ
Acid On Pregnant Woman’s Abdomen | కాన్పు సమయంలో.. గర్భిణీ కడుపుపై యాసిడ్ రాసిన నర్సు