రాయపోల్, జూన్ 28 : దౌల్తాబాద్ మండల పరిధిలోని ముబారాస్పూర్ 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్‌రావు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ముబారాస్పూర్ సబ్‌స్టేషన్ పరిధిలో మెయింటనెన్స్ పనుల కారణంగా అంతరాయం కలుగుతుందన్నారు. సబ్‌స్టేషన్ పరిధిలోని రాయపోల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని.. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.