హైదరాబాద్ నార్సింగిలో దారుణం జరిగింది. చాక్లెట్ ఇప్పిస్తానంటే నమ్మించి ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిపి, ఆపై హత్యాచారం చేశాడు.
నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. దీంతో వెంటనే అతడిని పట్టుకుని విచారించగా.. రాత్రి ఒంటి గంటకు బాలిక మృతదేహాన్ని చూపించాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.