Dancing missile | యుద్ధంలో తొలిసారి ‘డ్యాన్సింగ్ మిస్సైల్’ను వాడిన ఇరాన్.. దాని ప్రత్యేకత ఏంటంటే..!
Dancing missile | ఇజ్రాయెల్, అమెరికా (Israel, USA) దాడులకు ప్రతిగా ఇరాన్ (Iran) ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల (Gulf Countries) లోని అమెరికా స్థావరాలు, ఆస్తులే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది.
Dancing missile : ఇజ్రాయెల్, అమెరికా (Israel, USA) దాడులకు ప్రతిగా ఇరాన్ (Iran) ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల (Gulf Countries) లోని అమెరికా స్థావరాలు, ఆస్తులే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. బహ్రెయిన్ (Bahrain), సౌదీ అరేబియా (Saudi Arabia), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తదితర దేశాలపైకి భారీగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నది.
తాజాగా ఇజ్రాయెల్, యూఎస్ స్థావరాలే లక్ష్యంగా చేసిన దాడుల్లో ఇరాన్ అధునాతన క్షిపణులను ప్రయోగించింది. యుద్ధంలో తొలిసారిగా డ్యాన్సింగ్ మిస్సైల్‌గా పిలువబడే ‘సెజ్జిల్-2’ ని వినియోగించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణిని అషౌరా అనే పేరుతో కూడా పిలుస్తారు. సుదూరప్రాంతాల్లోని లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు.
డ్యాన్సింగ్ మిస్సైల్ ప్రత్యేకత..!
ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ డ్యాన్సింగ్ మిసైల్ పరిధి 2,000 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఏకంగా 700 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. అత్యధిక ఎత్తులో కూడా సమర్థంగా తిరుగుతూ లక్ష్యాన్ని ఢీకొడుతుంది. అందుకే దీన్ని డ్యాన్సింగ్ మిసైల్ అని పిలుస్తారు. ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా ఈ క్షిపణిని రూపొందించారు.
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రకారం.. ఈ క్షిపణి దాదాపు 18 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. దీని బరువు 23,600 కిలోగ్రాములు. ఈ క్షిపణుల రూపకల్పనను ఇరాన్ 1990లో ప్రారంభించింది. మొదటిసారిగా దీన్ని 2008లో పరీక్షించారు. ఆ సమయంలో ఈ క్షిపణి దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది.
దాంతో మెరుగైన నావిగేషన్ వ్యవస్థలను రూపొందించి 2009లో రెండోసారి ఈ మిస్సైల్‌ను పరీక్షించారు. అప్పటి నుంచి ఆ తర్వాత కూడా పలుమార్లు పరీక్షలు జరిపారు. ఆరోసారి ప్రయోగం చేసే సమయంలో ఈ క్షిపణి హిందూ మహాసముద్రంలోకి దాదాపు 1,900 కిలోమీటర్లు ప్రయాణించినట్లు సమాచారం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

