Priyanka Chopra | ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న అభిమానులు
Priyanka Chopra | అమెరికాలో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ జంటకు తృటిలో ప్రమాదం తప్పిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Priyanka Chopra | అమెరికాలో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ జంటకు తృటిలో ప్రమాదం తప్పిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్స్ 2026 కార్యక్రమానికి ప్రజెంటర్‌గా హాజరైన ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌కు వెళ్లారు. అయితే భద్రతా కారణాల వల్ల వారి వాహనాన్ని నేరుగా వేదిక దగ్గరకు అనుమతించలేదు. దీంతో నిర్వాహకులు గోల్ఫ్ కార్ట్‌లో తీసుకెళ్లారు.
ఈ సమయంలో డ్రైవర్ వేగంగా కార్ట్‌ను మలుపు తిప్పడంతో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. కార్ట్‌లోని ఒక టైర్ గాల్లోకి లేచినట్లు కనిపించింది. ఈ పరిస్థితిలో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ గట్టిగా పట్టుకుని పడిపోకుండా నిలబడటానికి ప్రయత్నించారు. నిక్ జోనాస్ కాస్త భయపడినట్లు కూడా వీడియోలో కనిపించింది.అయితే వెంటనే స్పందించిన డ్రైవర్ వాహనాన్ని మళ్లీ కంట్రోల్లోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, ఆస్కార్ వేడుక కోసం సోమవారం ఉదయం డాల్బీ థియేటర్‌కు నేరుగా వెళ్లేందుకు ప్రియాంక చోప్రా వాహనానికి అనుమతి ఇవ్వలేదు. అందుకే నిర్వాహకులు గోల్ఫ్ కార్ట్‌లో వారిని వేదిక వద్దకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
ఇక రెడ్ కార్పెట్‌పై మాత్రం ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జంట స్టైలిష్‌గా మెరిసింది. ప్రియాంక తెలుపు రంగు డియోర్ గౌన్‌లో అద్భుతంగా కనిపించగా, బుల్గారీ డైమండ్-ఎమరాల్డ్ నెక్లెస్‌తో తన లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. నిక్ జోనాస్ క్లాసిక్ బ్లాక్ టక్సెడోలో ఆమెతో కలిసి రెడ్ కార్పెట్‌పై నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 98వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ప్రియాంక చోప్రా ప్రముఖ నటుడు జేవియర్ బార్డెమ్‌తో కలిసి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును ప్రకటించడానికి స్టేజ్‌పైకి వచ్చారు. మొత్తానికి ఆస్కార్ వేడుకలో ప్రియాంక-నిక్ జంట గ్లామర్‌తో పాటు ఈ తృటిలో తప్పిన ప్రమాదం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
#VIRAL Nick Jonas y su esposa, Priyanka Chopra, casi sufren un accidente antes de pisar la alfombra roja de los Oscar. Así les fue en su trayecto en el carrito de golf hacia la entrada del Dolby Theatre#Oscars #JLMNoticias #Aguascalientes #Ags pic.twitter.com/EcO2kky81X
— José Luis Morales (@JLMNoticias) March 16, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

