INDW vs ENGW : ఐదు టీ20ల సిరీస్ తొలిమ్యాచ్‌లోనే భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. నాటింగ్హమ్లోని ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(112) అకాశమే హద్దుగా చెలరేగింది. ఈ ఫార్మాట్లో తొలి శతకంతో ఆమె గర్జించగా.. హర్లీన్ డియోల్(43) మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ ఇద్దరి విధ్వంసంతో టీమిండియా పొట్టి క్రికెట్లో టీమిండియా రెండో అత్యధిక స్కోర్ కొట్టింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసిన మంధాన బృందం ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
ఇంగ్లండ్ గడ్డ మీద తొలి పోరులోనే భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్, కెప్టెన్ స్మృతి మంధాన(112) సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టు భారీ స్కోర్‌లో కీలక పాత్ర పోషించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు షఫాలీ వర్మ(20)తో కలిసి శుభారంభం ఇచ్చిన ఆమె.. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది.
Innings Break!
Captain Smriti Mandhana’s 112(62) helped #TeamIndia post a mammoth target 🎯
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/iZwkYt8agO#TeamIndia | #ENGvIND pic.twitter.com/ryBUJAAtJ6
— BCCI Women (@BCCIWomen) June 28, 2025
అనంతరం వచ్చిన హర్లీన్ డియోల్(43) జతగా మంధాన మరింత దూకుడుగా ఆడింది. ఇంగ్లండ్ బౌలింగ్ దళాన్ని హడలెత్తిస్తూ బౌండరీలతో హోరెత్తించింది. లారెన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లలో సెంచరీ పూర్తి చేసుకుంది భారత కెప్టెన్. ఈ ఫార్మాట్లో తొలిసారి మొదటిసారి మూడంకెల స్కోర్ అందుకున్న మంధాన టీ20ల్లో శతకం బాదిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. డియోల్, మంధాన మెరుపులతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్లో మన జట్టుకు ఇది రెండో అత్యధిక స్కోర్. నిరుడు వెస్టిండీస్‌పై కొట్టిన 217 టాప్ స్కోర్‌గా ఉంది.