కట్టంగూర్, జూన్ 28 : ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పనిసరి అని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ పదవీ విరమణ వీడ్కోలు సమావేశం శనివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ క్రీడల్లో ఎంతో మంది విద్యార్థులను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికయేందుకు కృషి చేశారని తెలిపారు.
విద్యార్థులను శారీకంగా, మానసికంగా తయారు చేయడంతో ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. అనంతరం విజయ్‌కుమార్‌ను బడుగుల లింగయ్య తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కట్టంగూర్, నకిరేకల్ ఎంఈఓలు అంబటి అంజయ్య, మేక నాగయ్య, ఉపాధ్యాయులు గపూర్, ఆంథోని, మహాలక్ష్మి, సునంద, చిన్ని శ్రీనివాస్ పాల్గొన్నారు.