INDW vs NZW 3rd ODI : టీ20 వరల్డ్ కప్ సిరీస్ విజేతకు భారత మహిళల జట్టు దిమ్మదిరిగే షాకిచ్చింది. వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ వన్డే సిరీస్ కొల్లగొట్టింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో అద్భుత విజయంతోవన్డే సిరీస్ కైవసం చేసుకుంది. స్వల్ప ఛేదనలో ఓపెనర్ స్మృతి మంధాన(100) సెంచరీతో విరుచుకుపడగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(55) అజేయంగా ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చింది. దాంతో, 6 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా 2-1తో వన్డే సిరీస్ సొంతం చేసుకుంది.
టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే ఇంటికొచ్చేసిన భారత మహిళల జట్టు పంజా విసిరింది. మెగా టోర్నీలో 67 పరుగుల తేడాతో ఓడించిన వరల్డ్ కప్ చాంపియన్ న్యూజిలాండ్‌కు తొలి సిరీస్ ఓటమిని కానుకగా అందించింది. 232 పరుగుల ఛేదనలో ఓపెనర్ స్మృతి మంధాన(100) సెంచరీతో చెలరేగింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ(12) నిరాశపరిచినా మంధాన సాధికారికంగా ఆడింది. యస్తికా భాటియా(35) కూడా ఆమెకు చక్కని సహకారం అందిస్తూ ఒత్తిడిని దూరం చేసింది.
📸 💯@mandhana_smriti departs for a fantastic 100(122) as #TeamIndia edge closer to a win 👏
Updates ▶️ https://t.co/B6n070iLqu#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/8KphaWYTQl
— BCCI Women (@BCCIWomen) October 29, 2024
రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించిన ఈ ఇద్దరినీ సోఫీ డెవినె విడదీసింది. 21వ ఓవర్ ఆఖరి బంతికి రిటర్న్ క్యాచ్‌తో యస్తికను పెవిలియన్ పంపింది. అప్పటికీ టీమిండియా 92-2 పటిష్ట స్థితిలోనే ఉంది. యస్తిక ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(55 నాటౌట్) మంధాన జతగా ఇన్నింగ్స్ నిర్మించింది. ఈ ఇద్దరూ అలవోకగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ.. చెత్త బంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోర్ బోర్డును నడిపించారు.
3rd ODI ✅
Series ✅#TeamIndia win the third and final #INDvNZ ODI by 6 wickets and complete a 2-1 series win over New Zealand 👏Scoreboard ▶️ https://t.co/B6n070iLqu@IDFCFIRSTBank pic.twitter.com/grwAuDS6Qe
— BCCI Women (@BCCIWomen) October 29, 2024
అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన మంధాన కివీస్ బౌలర్లను ఉతికేస్తూ వంద కొట్టేసింది. అయితే.. భారీ షాట్ ఆడబోయి అన్నా రొవే బౌలింగ్‌లో బౌల్డ్ అయింది. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్(22) ధాటిగా ఆడగా.. కౌర్ కూడా వేగం పెంచింది. దాంతో, లక్ష్యం కరుగుతూ వచ్చింది. విజయానికి ఒక్క పరుగు దూరంలో రోడ్రిగ్స్ ఎల్బీగా వెనుదిరిగినా.. బౌండరీతో కౌర్ జట్టుకు చిరస్మరణీయ విజయం కట్టబెట్టింది.
That HUNDRED Feeling 💯🤗
Live – https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H
— BCCI Women (@BCCIWomen) October 29, 2024
న్యూజిలాండ్‌పై సూపర్ సెంచరీ కొట్టిన మంధాన మరో రికార్డు సాధించింది. టీమిండియా తరఫున అత్యధిక శతకాలు బాదిన మాజీ సారథి మిథాలీ రాజ్ (Mithali Raj) రికార్డును మంధాన బద్ధలు కొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 6 శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. పూనమ్ రౌత్ మూడుసార్లు వంద బాదేసింది.
A historic day for Smriti Mandhana 🔝 pic.twitter.com/BX7naR7ClR
— ESPNcricinfo (@ESPNcricinfo) October 29, 2024
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలుత భారత బౌలర్లు తడాఖా చూపించారు. రెండో వన్డేలో విజయంతో జోరు మీదున్న న్యూజిలాండ్‌ను ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. స్పిన్నర్ ప్రియా మిశ్రా(2\41) విజృంభణతో కివీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఒకదశలో 88 పరుగులకే ఐదు వికెట్లు పడగా బ్రూక్ హల్లిడే(86) హాఫ్ సెంచరీతో కదం తొక్కింది. వికెట్ కీపర్ ఇసబెల్లా గేజ్(25)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖర్లో పేసర్ లీ తహుహు(24) దంచి కొట్టి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించింది. హల్లిడే, తహుహుల పోరాటంతో భారత్‌కు కివీస్ 233 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.