Jathara Trailer | కంటెంట్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమాలు అందించే విషయంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇదే లైన్లో వస్తూ.. ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది జాతర (Jathara) . దేవుడు ఆడే జగన్నాటకం.. ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం అంటూ సతీశ్ బాబు రాటకొండ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న జాతర ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు మేకర్స్.
అమ్మోరు తల్లి ఊరు వదిలి వెళ్లిపోయిందహో అంటూ దండోరాతో షురూ అయింది ట్రైలర్. నువ్వు ఎక్కడ పడితే అక్కడ గోడ కట్టేసుకోవడానికి అమ్మోరు నీ ఇంట్లో గొడ్డు అనుకున్నావా..? తోలేసుకుని బతికే వాళ్లమే కానీ తోలు అమ్ముకొని బతికే వాళ్లం కాదంటూ.. సంభాషణలతో సాగుతున్న ట్రైలర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాపై హైప్ పెంచేస్తుంది.
చిత్తూరు బ్యాక్ డ్రాప్లో సాగే జాతర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందు రానుంది. గల్లా మంజునాథ్ సమర్పిస్తున్న ఈ మూవీని రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై ఎల్ఎల్సీతో కలిసి రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దియారాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్, ఆర్కే పిన్నపాల ఇతర పాత్రల్లో నటిస్తుండగా.. శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్నారు.
జాతర ట్రైలర్..
“Jathara” Trailer Promises Spine-chilling Experience!!
Meanwhile, the trailer was released by renowned producer Raj Kandukuri, who extended his best wishes to the film’s team.
#JatharaTrailer https://t.co/IJKD9oBQZW 👈🏻👈🏻 pic.twitter.com/gZM2YO5PYv— BA Raju’s Team (@baraju_SuperHit) October 29, 2024
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా..?
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..