అమరావతి : ఏపీలో ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు (AP TET ) సంబంధించిన ఫైనల్ కీ (Final key) ని పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి విడుదల చేసింది. cse.ap.gov.in వెబ్సైట్లో టెట్ ఫైనల్ కీ ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలను (TET Exam) నిర్వహించింది. అభ్యర్థుల అభ్యంతరాలను పరిశీలించిన తరువాత తుది కీ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు.
నవంబర్ 2న ఫలితాలను విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం ప్రకటించే అవకాశాలున్నాయి. నవంబర్ మొదటివారంలో మెగా డీఎస్సీ-2024 (Mega DSC) నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల( Teacher Posts) భర్తీ చేయనున్నారు.