IND vs SL : పొట్టి సిరీస్‌లో బోణీ కొట్టిన భారత్ రెండో టీ20లో శ్రీలంక(Srilanka)ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్(3/26)) తిప్పేయడంతో ఆతిథ్య జట్టు 161 పరుగులకే పరిమితమైంది. టాస్ ఓడిన లంకకు శుభారంభం లభించినా భారత బౌలర్లు వరస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు.
అయితే.. కుశాల్ పెరీర(53) హాఫ్ సెంచరీతో శ్రీలంకను ఆదుకున్నాడు. ఓపెనర్ పథుమ్ నిశాంక(32) మినహా మిగతావాళ్లు ఎవరూ రాణించలేదు. దాంతో, లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 రన్స్ కొట్టింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్(2/30), అర్ష్‌దీప్ సింగ్(2/24)లు రాణించారు.
Kusal Perera gave Sri Lanka the platform but much like yesterday, their middle order crumbled quickly 📉
India set a target of 162 🎯https://t.co/ITR4nipG5J | #SLvIND pic.twitter.com/34wwuMWtk7
— ESPNcricinfo (@ESPNcricinfo) July 28, 2024
సొంతగడ్డపై తొలి టీ20లో ఓడిన శ్రీలంక రెండో మ్యాచ్‌లో పోరాడగలిగే స్కోర్ చేసింది. పవర్ ప్లేలోనే లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(10)ను అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత పథుమ్ నిశాంక() జతగా కుశాల్ పెరీర(53) భాగస్వామ్యం నిర్మించాడు. ఈ జోడీని బిష్ణోయ్ విడదీయగా డేంజరస్ పెరీరా, కమిందు మెండిస్(26)లను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. ఆ తర్వాత రమేశ్ మెండిస్(12) ధాటిగా ఆడి లంక స్కోర్ 160 దాటించాడు.