ఢిల్లీ : గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర క్రీడాశాఖ నిర్వహించనున్న ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ (కేఐటీజీ) ఈనెల 25 నుంచి మొదలుకానున్నాయి. కేంద్ర క్రీడా శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ), నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఛత్తీస్‌గఢ్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వరంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 6 దాకా జరుగబోయే ఈ క్రీడలను గిరిపుత్రుల రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, జగ్దల్పూర్, సర్గుజాలో నిర్వహించనున్నారు.
ఏడు మెడల్ స్పోర్ట్స్ (అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, రెజ్లింగ్)తో పాటు మల్లఖంభ్ (కర్ర ఆధారంగా ఆడే సంప్రదాయ క్రీడ), కబడ్డీ క్రీడలను ఆడించనున్నారు.