మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 03, 2020 , 17:45:30

బీబీఎల్‌ నుంచి వైదొలిగిన బెయిర్‌స్టో

బీబీఎల్‌ నుంచి వైదొలిగిన బెయిర్‌స్టో

న్యూఢిల్లీ:  రాబోయే బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌) నుంచి ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌- బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో వైదొలిగాడు. బీబీఎల్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బెయిర్‌స్టో సీజన్‌ నుంచి తప్పుకున్నట్లు ఫ్రాంఛైజీ గురువారం వెల్లడించింది.  లీగ్‌ ఆరంభానికి వారం రోజుల ముందు బెయిర్‌స్టో ఈ నిర్ణయం తీసుకున్నాడు.  బీబీఎల్‌ పదో సీజన్‌ డిసెంబర్‌ 10న మొదలవనుంది.

త్వరలో ఇంగ్లాండ్‌ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.టూర్‌లో బెయిర్‌స్టోకు చోటు దక్కే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ఇంగ్లీష్‌ జట్టుతో ఉన్న బెయిర్‌స్టో క్రిస్మస్‌ తర్వాత మెల్‌బోర్న్‌ ఫ్రాంఛైజీలో చేరాల్సి ఉంది.  


logo