అమరీందర్‌కు పక్కలో బళ్లెంలా సిద్దూ
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్‌కు మాజీ ఉప ముఖ్యమంత్రి, క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ పక్కలో బళ్లెంలా మారాడు. కెప్టెన్ ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తున్నారు సిద్దూ.

ఛండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్‌కు మాజీ ఉప ముఖ్యమంత్రి, క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ పక్కలో బళ్లెంలా మారాడు. కెప్టెన్ ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తున్నారు సిద్దూ. ఈ నెల 26 న రైతులు బ్లాక్ డే జరుపాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని అమరీందర్ సింగ్ కోరుతుండగా.. వద్దే వద్దు అదే రోజున మరీ ఉద్ధృతంగా ఆందోళన చేద్దామని సిద్దూ పిలుపునిచ్చారు. అంతటితో ఊరుకోకుండా తన ఇంటిపై నల్లజెండాను ఎగురవేసి రైతులు, కాంగ్రెస్ నేతలు తమతమ ఇండ్లపై నలుపు జెండాలను ఎగరేయాలని పిలుపునిచ్చారు.
కరోనా మార్గదర్శకాల నేపథ్యంలో బ్లాక్ డేను విరమించుకోవాలని ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వంతో సహకరించాలని ఆయన సూచించారు. అయితే, సిద్దూ మాత్రం ససేమిరా అంటూ.. బ్లాక్ డే జరిపితీరాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. అమృత్సర్, పాటియాలాలోని తన నివాసంలో సిద్దూ నల్ల జెండాను ఎగురవేశారు. సోషల్ మీడియా పోస్టుల్లో నల్ల జెండాలు పెట్టాలని సిద్దూ ప్రజలందరినీ అభ్యర్థించారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు నల్లజెండాలు ఎగురేయాలని సిద్దూ పిలుపునిచ్చారు.
కుదరని సయోధ్య..
రెండేండ్ల క్రితం తన శాఖను మార్చిన కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూ.. వీలుదొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై దాడి చేస్తూనే ఉన్నారు. సిద్ధూ తొలు బీజేపీలో ఉన్నారు. నరేంద్రమోదీతో పొసగని కారణంగా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.
కాగా, ఉపముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకున్నప్పటి నుంచి కెప్టెన్ అమరీందర్, సిద్దూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతున్నది. కాంగ్రెస్ నాయకత్వం రెండుసార్లు సయోధ్యకు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముక్కుసూటి మనిషి అయిన సిద్దూ కారణంగా కాంగ్రెస్‌కు కొన్ని తలనొప్పులు ఉన్నప్పటికీ.. ఆయనే పంజాబ్‌లో స్టార్ కంపెయినర్‌గా ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ నేతల మృతి.. చరిత్రలో ఈరోజు
‘హవానా సిండ్రోమ్’ : అమెరికాను కలవరపెడుతున్న మైక్రోవేవ్ దాడులు
కరోనా నియంత్రణకు కాక్టైల్ ఔషధాన్ని తీసుకొచ్చిన రోచె-సిప్లా
సహజంగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినండి..!
కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ పేరు కూడా..!
తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

