Air India Express | క్రూ సిబ్బంది మూకుమ్మడి సెలవులు.. 30 మందిపై సంస్థ వేటు
Air India Express | టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
Air India Express | టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సిబ్బంది మూకుమ్మడి సెలవులతో (sick leave) సుమారు 100 విమానాలను ఎయిరిండియా సంస్థ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సెలవులు పెట్టి విమాన సేవలకు అంతరాయం కల్పించిన వారిపై సంస్థ తాజాగా చర్యలకు ఉపక్రమించింది. సుమారు 30 మంది సిబ్బందిపై సంస్థ వేటు వేసింది.
ఈ మేరకు బుధవారం రాత్రి 30 మంది సిబ్బందికి సంస్థ తొలగింపు (termination) నోటీసులు పంపినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా తక్షణమే వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ నోటీసుల్లో పేర్కొంది. సరైన కారణం లేకపోయినా కావాలనే సెలవు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని ఉద్యోగులకు పంపిన నోటీసుల్లో సంస్థ పేర్కొంది.
సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్ సిబ్బంది (Cabin Crew) ఒకేసారి సెలవు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏకంగా 100కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం విధులకు హాజరు కావాల్సిన సిబ్బంది చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. ఫలితంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రభావం సుమారు 15 వేల మంది ప్రయాణికులపై పడినట్లు సదరు వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దుపై నివేదిక సమర్పించాలని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ యాజమాన్యాన్ని పౌరవిమానయాన శాఖ కోరింది.
Also Read..
Navjeet Sandhu | ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి హత్య.. హర్యానాకు చెందిన ఇద్దరు సోదరులు అరెస్ట్
Cash Seized | హైదరాబాద్ నుంచి గుంటూరుకు.. రూ.8.40 కోట్లు సీజ్
BRS | బీఆర్ఎస్తోనే బీజేపీకి చెక్!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

