జగ్గయ్యపేట: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు (Cash Seized) పట్టుబడింది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీచేశారు. దీంతో ఓ లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు పట్టుబడ్డాయి. ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు. అక్రమంగా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు.
#WATCH | Andhra Pradesh: NTR district police seized Rs 8 crores cash at the Garikapadu check post in NTR district. The money was discovered in a pipe-loaded lorry in a separate cabin and two individuals have been detained. The money was being transported from Hyderabad to Guntur.… pic.twitter.com/Sqmpq9EIdc
— ANI (@ANI) May 9, 2024