T20 World Cup 2026 : యూరప్‌లో ఒకటైన ఇటలీ (Italy) పేరు చెబితే ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి ఆటల్లోని రికార్డులే గుర్తుకు వచ్చేవి. కానీ, ఇప్పుడు క్రికెట్లో కూడా ఇటలీ సంచలనాలు సృష్టిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ఆ జట్టు ఏకంగా పురుషుల టీ20వరల్డ్ కప్ (T20 World Cup 2026) పోటీలకు అర్హత సాధించింది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్‌లో ఈ పసికూన ఆడనుంది. ఐసీసీ మెగా టోర్నీ బరిలో నిలవడవం ఇదే మొదటిసారి. టీ 20 వరల్డ్ కప్ యూరప్ క్వాలిఫయర్స్‌లో ఇరగదీసిన ఇటలీ.. విశ్వ వేదికపై తమ ఆగమనాన్ని ఘనంగా చాటాలని ఆరాటపడుతోంది.
టీ 20 వరల్డ్ కప్ యూరప్ క్వాలిఫయర్స్‌లో జో బర్న్స్(Joe Burns) కెప్టెన్సీలోని ఇటలీ అద్భుత విజయాలతో అదరగొట్టింది. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి బలమైన జట్లను వెనక్కి నెట్టి చరిత్రలో తొలిసారి పొట్టి ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. స్విట్జర్లాండ్‌లోని ది హేగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఇటలీ ఓడిపోయింది.
Joy in the Italian camp after sealing their first-ever spot at the ICC Men’s #T20WorldCup 🤩 pic.twitter.com/uVaYtQqjvT
— ICC (@ICC) July 12, 2025
కానీ, నెట్ రన్‌రేటు మెరుగ్గా ఉండడంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వరల్డ్ కప్ బెర్తు కైవసం చేసుకుంది. దాంతో, ఆ జట్టు ఆటగాళ్ల సంబురాలకు హద్దే లేకుండా పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత ఓవర్లలో 134 రన్స్ చేసింది. అనంతరం డచ్ టీమ్ లక్ష్యాన్ని ఛేదించినప్పటికీ అనుకున్న రన్‌రేటు సాధించలేదు. అయినా సరే వరల్డ్ కప్ బరిలో నిలిచింది.
Netherlands and Italy qualify from Europe, leaving five spots up for grabs for ICC Men’s #T20WorldCup 2026 👀
➡️ https://t.co/rdTHHVs76D pic.twitter.com/8VAJW3hdP4
— ICC (@ICC) July 12, 2025
భారత్, లంక వేదికగా జరుగబోయే వరల్డ్ కప్ పోటీలకు ఇప్పటివరకూ 15 జట్లు అర్హత సాధించాయి. ఆతిథ్య భారత్, లంకతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, దక్షిణాఫ్రికా, కెనడా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వెస్టిండీస్ న్యూజిలాండ్, యూఎస్ఏ, ఇటలీ జట్లు క్వాలిఫై అయ్యాయి. త్వరలో జరుగనున్న ఆసియా క్వాలిఫయర్, ఆఫ్రికా క్వాలిఫయర్ ఫలితాలతో మరో ఐదు బెర్తులు ఖాయం అవుతాయి.,