తిరుమల : ఇటీవల అమెరికాలో జరిగిన ప్రపంచ పోలీసు క్రీడల్లో (World Police Games ) బంగారు, కాంస్య పతకాలు సాధించిన టీటీడీ వీజీవోలు సురేంద్ర, రామ్ కుమార్ను శనివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ ( TTD Chairman) బీ.ఆర్.నాయుడు ( BR Naidu) అభినందించారు. ఈ సందర్భంగా తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన విజేతలు తాము సాధించిన పతకాలను చైర్మన్కు చూపించారు. టీటీడీ ప్రతిష్ట మరింత పెంచేలా విజయం సాధించిన ఇరువురు భధ్రతాధికారులను టీటీడీ చైర్మన్ అభినందించారు.
శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 70,217 మంది భక్తులు దర్శించుకోగా 31,155 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.84 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.