Ishan Kishan : సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (Ishan Kishan)కు బంపర్ ఆఫర్ వచ్చింది. జాతీయ జట్టులో పునరాగమనం కోసం నిరీక్షిస్తున్న ఈ లెఫ్ట్‌హ్యాండర్ దేశవాళీలో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. త్వరలో జరుగబోయే రంజీ ట్రోఫీలో జార్ఖండ్ (Jharkhand) జట్టుకు ఇషాన్ సారథిగా వ్యవహరించనున్నాడు. వెటరన్ ఆటగాడు మనోజ్ తివారీ (Manoj Tiwary)వీడ్కోలు పలకడంతో.. ఇషాన్‌కు పగ్గాలు అప్పగించామని బుధవారం ఆ రాష్ట్ర సెలెక్షన్ కమిటీ చైర్మన్ సుబ్రొతో దాస్ వెల్లడించాడు.
ఇసాన్ అనుభవం గల క్రికెటర్. అతడికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఈసారి మేము యువకులతో నిండిన స్క్వాడ్‌ను ఎంపికచేశాం. సౌరభ్ తివా,ఈ షహ్బాజ్ నదీమ్, వరుణ్ అరోణ్లు నిరుడు సీజన్ తర్వాత వీడ్కోలు పలికారు. అందుకని జట్టును సమర్థంగా నడిపించే ఆటగాడి ఎంపిక అనివార్యమైంది.
Ishan Kishan has returned to the Jharkhand #RanjiTrophy team as its captain, following his controversial pullout last season that led to his exclusion from the #BCCI central contract.
MORE ▶️ https://t.co/V0NIMEd3qh | #CricketTwitter pic.twitter.com/dcwsHBrlCu
— Sportstar (@sportstarweb) October 9, 2024
యువకులతో కూడిన జట్టును ఇషాన్ అద్భుతంగా నడిపిస్తాడని నమ్ముతున్నాం. ఈ రంజీ ఎడిషన్‌లో మా జట్టు గొప్పగా రాణిస్తుందనే నమ్మకం ఉంది అని సుబ్రొతో తెలిపాడు. రంజీ ట్రోఫీ కోసం జార్ఘండ్ సెలెక్టర్లు 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. ఇందులో ఐపీఎల్ హీరో అనుకుల్ రాయ్ సహా పలువురు యువకెరటాలు ఉన్నారు. ఇప్పటివరకూ రంజీ చాంపియన్‌గా నిలవని జార్ఘండ్ జట్టు కలను ఇషాన్ నిజం చేస్తాడా? లేదా? చూడాలి.
జార్ఖండ్ స్క్వాడ్ (తొలి రెండు మ్యాచ్‌ల కోసం) : ఇషాన్ కిషన్(కెప్టెన్), విరాట్ సింగ్(వైస్ కెప్టెన్), కుమార్ కుషగ్ర(వికెట్ కీపర్), నజీమ్ సిద్ధిఖీ, అర్యమన్ సేన్, శరందీప్ సింగ్, కుమార్ సూరజ్, అనుకుల్ రాయ్, ఉత్కర్ష్ సింగ్, సుప్రియో చక్రవర్తి, సౌరభ్ శేఖర్, వికాస్ కుమార్, వివేకానంద తివారీ, మనీషి, రవి కుమార్ యాదవ్, రౌనక్ కుమార్.
India wicketkeeper batter Ishan Kishan will be seen leading Jharkhand in the Ranji Trophy 2024-25. Notably, Kishan, who missed the entire previous Ranji season, last led Jharkhand way back in 2018-19 season. Last season’s skipper Virat Singh has been named vice captain of the… pic.twitter.com/LsdREGbm7P
— IndiaToday (@IndiaToday) October 9, 2024
ఈ ఏడాది ఆరంభంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ జాతీయ జట్టుకూ దూరమయ్యాడు. అయితే.. బుచ్చిబాబు టోర్నీలో విధ్వంసక సెంచరీతో ఫామ్ చాటుకున్న అతడు ఇరానీ కప్‌లోనూ 38 పరుగులతో నిరాశపరిచాడు. దాంతో, బంగ్లాదేశ్‌తో టీ20 జట్టులోకి రాలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో రంజీ ట్రోఫీ రూపంలో అతడికి మరో అవకాశం వచ్చింది. ఈసారి జార్ఘండ్ తరఫున అతడు దంచికొడితే మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోవడం పక్కా అంటున్నారు క్రీడా పండితులు.